మహాత్మా గాంధీ: స్వాతంత్ర సమరయోధులలో భారతీయూలందరూ ఎంతగానో ఆదరించే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మన మహాత్మ గాంధీ (మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ )
మహాత్మా గాంధీ జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టాలు
ప్రజలు మహాత్మా గాంధీని జాతిపితగా భావించి, ఎంతో గౌరవిస్తారు. 20వ శతాబ్దంలో ఉన్న రాజకీయ నాయకులందరిలో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా కెబర్ న్యూస్ నెట్వర్క్ (CNN)లో గాంధీజీని గుర్తించారు.
సత్యం, అహింస గాంధీ సిద్ధాంతాలు మరియు ఆయుధాలు..
Mahatma Gandhi
జననం
గుజరాత్ లోని పోర్ బందర్లో 1869 అక్టోబర్ 2 న ఒక సామాన్య కుటుంబానికి చెందిన కరంచంద్ గాంధీ మరియు పూతలిబాయి దంపతులకు గాంధీజీ జన్మించారు. 13 ఏళ్ల వయసులో గాంధీజీకి కస్తూరిబాయి తో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు.
విద్య
మహాత్మా గాంధీ 19 ఏళ్ల వయసులో న్యాయశాస్త్ర విద్యాబ్యాసానికి ఇంగ్లాండ్ వెళ్లారు. అనేక మతాల ప్రవిత గ్రంథాలను చదివాడు.
భారత జాతీయ కాంగ్రెస్
భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో మహాత్మా గాంధీ పాల్గొనేవాడు. గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే పరిచయం చేశాడు.
బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా మహాత్మా గాంధీ యుద్ధములో ఉండడం అప్పట్లో చాలామంది నాయకులకు ఇష్టం లేకపోయిన కూడా, బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛనూ, హక్కులనూ కోరుకొనేవారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని అతని వాదం.
అందుకే మహాత్మా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధములో బ్రిటిష్ వారిని సమర్ధించి, సైన్యంలో చేరడాన్ని గోపాలకృష్ణ గోఖలే ప్రోత్సహించాడు.
మహాత్మా గాంధీ జీ సత్యాగ్రహాలు
గాంధీజీ 1918 లో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు.
1919 ఏప్రిల్ 13న పంజాబు లోని అమృత్ సర్, జలియన్ వాలా బాగ్ లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించడంతో సత్యాగ్రహము, అహింస అనే పోరాట విధానాలపై మిగిలిన వారికి కాస్త నమ్మకం రాగా, బ్రిటిష్ వారిని వ్యతిరేకించడంలో అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢమైన విశ్వాసం కలిగింది.
అంతే కాకుండా భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూ, సర్వత్రానూ ప్రబలమైంది.
1921లో భారత జాతీయ కాంగ్రెసుకు అతను తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందడంతో కాంగ్రెసును పునర్వ్యవస్థీకరించి, తమ ధ్యేయము “స్వరాజ్యము” అని ప్రకటించాడు.
వారి భావంలో స్వరాజ్యము అంటే పాలన మారటం మాత్రమే కాదు. వ్యక్తికీ, మనసుకీ మరియు ప్రభుత్వానికీ స్వరాజ్యము కావాలి.
గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశమే కానీ అంటరానితనమున్నచోట, మురికివాడలున్నచోట, హిందూ ముస్లిములు తగవులాడుకొంటున్నచోట ఉన్నదనుకోవడం అది మన మూర్ఖత్వం తప్ప, దానికి అర్ధం లేదు.
గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచనా సరైనందున భారతీయులు గర్విం పదగిన ఆధునిక భావాలూ, విలువలూ ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని ప్రతి ఒక్కరు గ్రహించాలి.
జైలులో..
గాంధీ 1922లో రెండు సంవత్సరాలు జైలులో గడిపాడు.
1927 లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత గాంధీ తిరిగి స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేబట్టాడు.
1929 డిసెంబర్ 31 న భారత స్వతంత్ర పతాకం లాహోరులో ఎగురవేయడంతో 1930 జనవరి 26ను స్వాతంత్ర్య దినంగా ప్రకటించాడు. ఆ రోజున ఉద్యమ చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును.
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం రావడంతో దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా దేశ విభజన వల్ల విషణ్ణుడైన గాంధీ మాత్రము కలకత్తాలో ఒక హరిజన వాడను శుభ్రము చేస్తూ గడిపాడు. అతని కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ, ముస్లిమ్ మధ్య మత విద్వేషాలు పెచ్చరిల్లి అతన్ని మరింత శోకానికి గురిచేశాయి.
నాథూరామ్ గాడ్సే
1948 జనవరి 30వ తేదీ మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్లో ప్రార్థనా సమావేశాన్ని సాయంత్రం 5:17 గంటలకు ముగించి బయటకు వస్తున్నప్పుడు కాల్చి చంపాడు.
గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతీలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లాయి.
గాంధీ పై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయాడు.
గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను ఇచ్చిన ఎఫ్ఐఆర్లో గాంధీ హే రామ్ అంటూ నేలకొరిగాడనే సమాచారాన్ని ఇచ్చాడు.