హోమియోపతి దినోత్సవం: నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం
హోమియోపతి వైద్యం జాతీయ వైద్య విధానాలలో ఒకటిగా గుర్తించబడింది. అధిక సంఖ్యాక ప్రజనీకానికి ఆరోగ్య సంరక్షణను కలుగచేయడంలో ఈ వైద్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
హోమియోపతీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి. భారతదేశంలో దీనికి లభిస్తున్న ప్రజాదరణ మరియు ప్రభుత్వాదరణ ప్రపంచంలో మరెక్కడా లభించటం లేదనటంలో అతిశయోక్తి కాదు. భారతదేశంలో నేటి వరకు అంటే ఒకటిన్నర శతాబ్దానికి మించి హోమియోపతి విధానం అనుసరించబడుతుంది.
ప్రస్తుత రోజుల్లో హోమియోపతి వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ వైద్యం హోమియోపతి యొక్క బిళ్ళల భద్రతతో మరియు సురక్షితంగా, సున్నితంగా వ్యాధులని నివారించే స్వభావం కలిగి ఉండటం వలన ప్రతి ఇంటా వినిపిస్తూ ఉండే మాటగా మారింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రెండవ వైద్యవిధానంగా ఇది పరిగణించబడుతుంది. ఈ పద్ధతి దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం పుట్టింది. కాలక్రమేణా ఈ పద్ధతిలో కొన్ని మార్పులు వచ్చాయి.
జర్మనీ దేశపు వైద్యుడు
జర్మనీ దేశపు వైద్యుడు శ్యామ్యూల్ హానిమాన్ కనిపెట్టిన హోమియోపతి వైద్యం కానీ, మందులు కానీ చాలా చౌక. ఈ మందులను, వైద్యాన్ని ఇంగ్లీష్ మందులతో పోల్చి చుసినా మరియు ఆయుర్వేద మందులతో పోల్చి చూసినా ఇది భారతదేశంలో చౌక కాబట్టి పేదవారికి ఈ పద్ధతి అందుబాటులో ఉంటుంది.

హోమియోపతి అన్న పదం హోమోయిస్ అంటే ఓకే రకమైన మరియు పేథోస్ అంటే బాధ, రోగ లక్షణం అనే రెండు మాటలని సంధించగా పుట్టిన పదం. తెలుగులో దీనిని సారూప్య లక్షణ వైద్యం అంటారు.
హోమియోపతి పితామహుడు డాక్టర్ శ్యామ్యూల్ హానిమాన్ జయంతి సందర్బంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10 న ప్రపంచ హోమియోపతి దినోత్సవం జరుపుకుంటారు.
హానిమాన్ హోమియోపతి వైద్యం ముఖ్యంగా మూడు అంశాల పై ఆధారపడి ఉంటుంది.
- ఆర్గనాన్ అంటే హోమియోపతి వైద్య సూత్రాలు.
- హోమియోపతి మెటీరియా మెడిక్ అంటే హోమియోపతి వస్తుగుణ దీపిక.
- మయాజమ్స్ అంటే ధీర్ఘ వ్యాధుల చికిత్స.
మొదటగా వైద్యులు ఆర్గనాన్ బాగా చదివి అర్ధం చేసుకోవాలి తర్వాత ఆర్గనాన్ లో చెప్పినట్లుగా మెటీరియా మెడిక్ బాగా చదివి అర్ధం చేసుకోని హానిమాన్ చెప్పినట్లుగా వైద్యం చేయాలి. ఈ వైద్యమే హానిమాన్ హోమియోపతి వైద్యం.
శ్యామ్యూల్ హానిమాన్ వైద్య సూత్రాలు
హానిమాన్ మహాశయుడు లోకోపకారం కోసం అద్భుతమైన నాలుగు వైద్య సూత్రాలను కనిపెట్టాడు.
- సారూప్య ఔషద సిద్ధాంతం.
- ధీర్ఘ వ్యాధుల చికిత్స (మయాజమ్స్ ).
- ఔషధాలను పొటెన్సీలు మార్చుట (పోటేoటైజేషన్ ), వ్యాధి తీవ్రతను బట్టి ఎంత పొటెన్సీలో మందును ఇవ్వాలి.
- డోసులను ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, ఎన్ని ఇవ్వాలి.
హోమియోపతి మూల సూత్రం
వజ్రం వజ్రేన భీద్యతే
అంటే.. ఏ పదార్ధామైతే బాధని కల్గిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని వాడాలి.