న్యూ ఢీల్లీ: వరంగల్ కు మొంథా తుఫాన్ కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం తక్షణ సహాయం అందించాలి.
అమృత్ 2.0 కింద ప్రత్యేక నిధులు విడదల చేయాలి.
GWMC మౌలిక వసతులపై హై లెవల్ ఆడిట్ చేయాలి.
రియల్-టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి
రోడ్లు–డ్రైనేజ్ పునరుద్ధరణకు ప్రత్యేకంగా 100 కోట్లు మంజూరు చేయాలి.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దే నా ద్యేయం వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
వరంగల్ నగరంలో అక్టోబర్లో మెుంథా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలు.
తుఫాను వల్ల కలిగిన భారీ నష్టంపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్సభలో జీరో అవర్లో గళమెత్తారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో శివనగర్, ఎన్ఎన్నగర్, డీకేనగర్ సహా 45 కాలనీలు తీవ్రంగా మునిగిపోయాయని ఎంపీ వివరించారు.
పోతన రోడ్, భద్రకాళి–పాలిటెక్నిక్ రోడ్, ములుగు రోడ్, బొండివాగు, పోచమ్మమైదాన్ 80 అడుగుల రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలతో నిండిపోయాయని, కొన్నిచోట్ల రహదారులు నదులుగా మారాయని ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు.
ఆ సమయంలో ఒక గర్భిణిని ట్రాక్టర్లో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
భారీ వర్షాల సమయంలో 1,200 మందిని 12 రిలీఫ్ క్యాంపులకు తరలించాల్సి వచ్చిందని ఎంపీ వెల్లడించారు.
AMRUT–స్మార్ట్ సిటీల కింద చేపట్టిన డ్రైనేజీ పనులు 66% మాత్రమే పూర్తికావడంతో ఈ దుర్ఘటన మరింత పెరిగిందన్నారు. ఇది పూర్తిగా ప్రణాళికా వైఫల్యం అని వ్యాఖ్యానించారు.
AMRUT 2.0 కింద ప్రత్యేక నిధులు మార్చి 2026లోగా విడుదల చేయాలని, GWMC మౌలిక వసతులపై ఉన్నత స్థాయి ఆడిట్ ఆదేశించాలని, రహదారి పునర్నిర్మాణానికి 100 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు.
హెరిటేజ్, స్మార్ట్ సిటీ అయిన వరంగల్ ప్రతి సంవత్సరం వర్షాలతో విధ్వంసం కాకుండా, కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కార దిశగా మౌలిక వసతులు కల్పించాలని ఎంపీ డా.కడియం కావ్య కోరారు.