GWMC కౌన్సిల్: నియోజకవర్గ అభివృద్ధి పై సుదీర్ఘ చర్చ..
పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం..
సభలో ప్రతి సభ్యుడు స్వేచ్ఛ వాతావరనంలో మాట్లాడుతున్నారు…
ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నాం..
అందెశ్రీ కి నివాళులు ఘటించిన గ్రేటర్ కౌన్సిల్..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రోజు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారి అధ్యక్షతన జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు గారు, శాసన మండలి సభ్యులు శ్రీ బస్వరాజు సారయ్య గారు.
సభ ప్రారంభంలో ఇటీవలే పరమపదించిన ప్రముఖ తెలంగాణ కవి, రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ మరణానికి నివాళులు అర్పించి మౌనం పాటించారు.
సభలో అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కులంకుశంగా చర్చ
గ్రేటర్ పరిధిలో గడిచిన పదేళ్లలో జరగని అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించామని, రోడ్లు , డ్రైన్ లు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సభ ద్వారా రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్ల సూచనలు తీసుకుని తప్పకుండా ముందుకు వెళ్తామని తెలిపారు.
గత పాలకుల హయాంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు చిన్నచూపు చూపుతో నిధులు కేటాయించలేదని కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని డివిజన్ లలో రాజకీయ బేషజలాలకు వెళ్లకుండా సమవుజ్జీగా నిధులను కేటాయించామని తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి చేపట్టిన తరువాత రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉంచినప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
ఎన్నికలకు ముందు పీసీసీ హోదాలో వరంగల్ కి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నారని అందులో భాగంగా మామునూరు విమానాశ్రయ ఏర్పాటుకు ప్రత్యేక చొరవతో ముందుకు వెళ్తుందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు రానున్న రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యే రానున్న రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మరచిన ప్రతిపక్ష పార్టీ నేతలు అసలు అభివృద్ధి జరగలేదనటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
నగరంలో ప్రధాన రోడ్లను సైతం సకాలంలో పూర్తి చేసి ప్రజారవాణాకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు.మూతపడిన విజయ డైరీని పునః ప్రారంభించి 28 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో గ్రేటర్ మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.