గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 57 కీలక ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో పోలీసులు మొత్తం 8,259 వాహనాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి డాక్యుమెంట్లు లేని 173 వాహనాలను సీజ్ చేశారు.
సీజ్ చేసిన వాహనాల వివరాలు:
• కార్లు – 9
• ద్విచక్ర వాహనాలు – 158
• ఆటోలు – 5
• ట్రాక్టర్ – 1
వరంగల్ ప్రాపర్టీ టాక్స్ 2025-26 ఆన్లైన్ చెక్ & పే
అక్రమ మద్యం కేసులు:
పోలీసులు 7 కేసులు నమోదు చేసి ₹1,18,000 విలువైన మద్యం, 3 లీటర్ల గూడంబా, ₹1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
అదనంగా ట్రాఫిక్ పోలీసులు 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
మరో కీలక పరిణామంలో మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భట్టుపల్లి గ్రామంలో జరిపిన తనిఖీల్లో మిస్సింగ్ కేసులో అదృశ్యమైన ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించి కనుగొన్నారు.
ఈ వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మీడియాకు తెలియజేశారు.